ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనముగా నివాళులు అర్పించారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
మాట్లాడుతూ…. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి విశిష్ట కృషిచేసిన గొప్ప వ్యక్తి అని, పలు ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారని, దేశంలో సుమారు 565 కి పైగా స్వాతంత్య్ర రాజ్యాలను దేశంలో విలీనం చేసి ఐక్య భారత్ నిర్మాణానికి అలుపెరగని కృషి చేశారన్నారు. విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన పటేల్ గారి జీవితం మనకు నిత్య ఆదర్శప్రాయమని, భారతదేశ సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని, అందుకే ఆయనకు ఉక్కుమనిషి బిరుదు లభించిందని తెలిపారు.

