తూర్పుగంగవరం గ్రామానికి చెందిన సర్వే నంబర్ 229లో
190.5 ఎకరాలు ఉమ్మడి బీడు భూమిని రక్షించాలని పలువురు తూర్పుగంగవరం గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ సంజీవ రావుకు ఫిర్యాదు చేసారు. సంబంధిత సర్వే నంబర్లో గ్రామ పెద్దలు ఏడుగురి పేరుపై పూర్వం నుండి ఉన్నదని అందులో కొందరూ ఆ భూమిని అందులో ఇరువురు అన్యాక్రాంతం చేయటానికి ఇష్టపడగా అడ్డుకున్నామని, ప్రస్తుతం ఆ భూమిలో మట్టి తర్వకాలకు అనుమతి ఇవ్వటానికి పూనుకున్న విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. ఆ భూమిని నమ్మకుని నాలుగు గ్రామాలకు చెందిన పశు జీవాలు బతుతుకున్నాయని, తగిన న్యాయం చెయ్యాలని గ్రామానికి చెందిన కనిశెట్టి రామ లక్ష్మయ్య, జాష్టి గిరిబాబు, అనిల్ కుమార్, గుజ్జుల చిన రామి రెడ్డి తదితరులు విన్నవించారు.
