జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఉపాధి పనులపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టడంతో పాటు సరాసరి వేతనం ఎక్కువగా వచ్చేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి గృహ నిర్మాణాల పురోగతిపై, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, జాతీయ ఉపాధి హామీ పధకం అమలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ కు ( సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల స్థాపన) సంబంధించిన సర్వే, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, స్కూల్ టాయిలెట్స్ ఇన్స్పెక్షన్, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ & జియో కోఆర్డినేట్స్, ఎన్పీసీఐ లింక్, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్, తదితర అంశాలపై మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, ఏపీడీ, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఎం.పి.డి.ఓ లు, ఏపిడీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి హామీ పనులను మానిటర్ చేయాలని ఆదేశించారు. వేజ్ సీకర్స్ ని మొబిలైజ్ చేయాలని, కేటాయించిన మేరకు ఉపాధి పనుల లక్ష్యాలను చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాలు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ఫారంపాండ్ నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. జిల్లాలో పేద కుటుంబాల ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద చుపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో లక్ష ఇళ్ళను సామూహికంగా ప్రారంభోత్సవాలు చేపడుతున్నందున, జిల్లాలో 3,800 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 2003 ఇళ్ళు పూర్తి చేయ్యడం జరిగిందని , మిగిలిన ఇళ్ళ నిర్మాణాలను రోజువారీ లక్ష్యాలను నిర్దేసించుకొని త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి వంద శాతం గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టడంతో పాటు గ్రౌండింగ్ అయిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్, వాటర్ టెస్టింగ్, క్లోరినేషన్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూఎస్. అధికారులను ఆదేశించారు. పారిశుద్ద్య ఏర్పాట్ల పై పంచాయతీ రాజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుధ్య ఏర్పాట్ల పై అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. గ్రామ, వార్డ్ సచివాలయాల సిబ్బంది ప్రతి ఒక్కరు కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎం.పి.డి.ఓ లను ఆదేశించారు. ఎన్పిసిఐ మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన ఎంఎస్ఎంఈ సర్వే త్వరగా పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జడ్పి సిఈఓ చిరంజీవి, డ్వామా పిడి జోసఫ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ బాల శంకర రావు, పరిశ్రమల శాఖ జిఎం శ్రీనివాస రావు, మెప్మా పిడి రవి కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, సంబంధింత శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


