పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను తాళ్లూరు మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త కైపు వెంకట క్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో తాళ్లూరు బీసీ సంక్షేమ వసతి గృహాంలో కేక్ను కట్ చేసి, విద్యార్థులకు నోటు పుస్తకాలు, అభ్యసన సామగ్రిని పంచి పెట్టారు. వైఎస్ షర్మిల ఆయురారోగ్యాలతో ఉన్నత స్థాయి పదవులు అధిరోహించాలని క్రిష్ణా రెడ్డి అన్నారు. పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేసేందుకు ఆమె తోడ్పాటు ఎంతో సహకరిస్తున్నందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.



