ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందేలా తగిన సూచనలు చెయ్యాలని వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి అన్నారు. ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆశ. ఆరోగ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో క్రమం తప్పకుండా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉన్న సీనియర్ సిటిజన్ కంచర్ల పిచ్చమ్మ ఆరోగ్యం అందుకు నిదర్శమన్నారు. తమకు సక్రమంగా సేవలు అందిస్తూ మందులు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని సీనియర్ సిటిజన్ కంచర్ల పిచ్చమ్మ కుమారుడు కాలేషాబాబు అభినంది కృతజ్ఞతలు తెలిపారు. అర్ధరాత్రులు సైతం సేవలు అందిస్తున్న వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి సేవలు ఆదర్శనీయమని అన్నారు. వారి సేవలను అభినందిస్తూ ప్రాధమిక ఆరోగ్య సిబ్బంది. 104 సిబ్బందికి 61మందికి స్వీట్ బాక్స్‌లను కంచర్ల పిచ్చమ్మ అందించారు. ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు సక్రంగా వస్తుందని అందరూ ఆయా గ్రామాలలో ఉత్తమ సేవలు అందించి సీనియర్ సిటిజన్స్ దీవేలను పొందాలని, అందుకు కంచర్ల పిచ్చమ్మకు అందిస్తున్న సేవలు ఆదర్శంగా తీసుకోవాలని వైద్యాధికారి సూచించారు. గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా స్వీట్స్ అందిస్తున్నట్లు కంచర్ల పిచ్చమ్మ కుమారుడు ఏబీసీ హైస్కూల్ డైరెక్టర్ కె. కాలేషా బాబు తెలిపారు.




