వైసిపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దర్శి నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మంది వైఎస్ఆర్సిపి నాయకులు కలిసి ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాలెండర్ ను చీమకుర్తి లోని బివి ఎస్ఆర్ పార్క్ వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లు పోశం మధుసూదన్ రెడ్డి, జి. మోషే , వైసిపి దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి ( మహేష్), దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కీసరి రాంభూపాల్ రెడ్డి, మేడం మోహన్ రెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, దొనకొండ ఎంపీపీ ఉషా మురళి తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

