ఘనంగా బూచేపల్లి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు నిర్వహణ – అధిక సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు – ప్రజలకు అభివాదం చేసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైసీపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

నూతన సంవత్సర వేడుకలను బుధవారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి నూతన సంవత్సర వేడుకలతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేసారు. మహిళలు, ప్రజలు ఎక్కువగా దైవ సన్నిధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు పలు పార్టీల నేతలను కలుసుకొని శుభాకాంక్షలను తెలిపారు. చీమకుర్తిలో, దర్శిలో బూచేపల్లి నివాసం వద్ద అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,వైసీపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి కుటుంబసభ్యులకు అధిక సంఖ్యలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వారిని గజ మాలలతో సన్మానించారు. కేక్ లు కట్ చేసి పంచి పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *