నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా గ్రామ/వార్డు సచివాలయం మహిళా పోలీస్ అసోసియేషన్ వారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ చేతుల మీదగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. మహిళా పోలీస్ వారి విధులు మరియు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొని రాగా ఎస్పీ సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సైబర్ క్రైమ్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు, చిన్నారులపై జరిగే అకృత్యాలు వంటి ఎన్నో విషయాలు విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టాల్సిన కార్యచరణను దిశా నిర్దేశం చేసారు.
కార్యక్రమంలో మహిళా పోలీస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆత్మూరి కరుణ, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ బాపట్ల యామిని, స్టేట్ జాయింట్ సెక్రెటరీ అరుణ ప్రణతి, ఇతర అసోసియేషన్ సభ్యులు జి. అనూష షేక్. షాహినా , కే. జ్యోతి , ఎన్. హిమబిందు పాల్గొన్నారు.


