గ్రామైఖ్య పొదుపు సంఘం బాధ్యులు గ్రామీణ కమ్యునిటీ
ఆధారిత ఆధారిత సంస్థల కోసం ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని ఐబి డీవీఎం సిహెచ్ నరసింహా రావు అన్నారు. వెలుగు కార్యాలయంలో శనివారం తాళ్లూరు, ముండ్లమూరు ఐకేపీ విఓఏ లకు లోకోస్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమాచార సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలపై డీవీఎం సిహెచ్ నరసింహా రావు తగిన సూచనలు చేసారు. సేకరించిన సమాచారాన్ని సంబంధిత యాప్ లో నమోదు చెయ్యాలని ఆ సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాల కోసం తీసుకొన బోవు వలు సంక్షేమ కార్యక్రమాలకు ఎంతగానో ఉ వయోగవతుందని అన్నారు. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత వివరాలు, జీవనోపాధి, పొదువు, ఆర్థిక మధ్యవర్తిత్వం వంటి వివరాలు రికార్డు చేయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఎరియా కోఆర్డినేటర్ వసుంధరా దేవి, ఎం ఎం ఎస్ అధ్యక్షురాలు సుజాత, ఏపీ ఎం దేవ రాజ్, సీసీలు మోహన రావు, సుచంద్ర, కోటేశ్వర రావు, రత్న కుమారి, సీఆర్టీలు మోబీనా, సుజాత లు పాల్గొన్నారు.

