ముండ్లమూరు మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ గా మాకినేని మురళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సింగంశెట్టి సత్యనారాయణ బదిలీపై దర్శికివెళ్లారు. ఆయన స్థానంలో కందుకూరులో హౌసింగ్ కార్యాలయంలో పని చేస్తూ బదిలీపై ముండ్లమూరుకునియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆర్ జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ అభివృద్ధికి తమ వంతు పని చేస్తానన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్న వాటి పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానన్నారు.
