బేగంపేట మార్చి 7(జే ఎస్ డీ ఎం న్యూస్)
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంలో రాణి అహల్య బాయ్ హోల్కర్ ముఖ్య భూమిక పోషించారని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు ఆధ్యాత్మిక ప్రవక్త ప్రొఫెసర్ కాకునూరి సూర్య నారాయణ అన్నారు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో శుక్రవారం రాజమాత అహల్య బాయ్ హోల్కర్ 300 వ జయంతి నీ పురస్కరించుకొని కళాశాలలో ఎన్ఎస్ఎస్, లియో క్లబ్ మరియు ఏ బి ఆర్ ఎస్ ఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి సభను ఉద్దేశించే ప్రసంగిస్తూ రాణి అహల్యా బాయ్ హోల్కర్ 300 సంవత్సరాల క్రితం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో ముఖ్య భూమిక పోషించారని, తన ధైర్యసాహసాలతో నాయకత్వ లక్షణాలతో సనాతన సాంప్రదాయాలను కొనసాగించి ధీర వనితగా , గొప్ప పరిపాలన లక్షణాలతో 165 హిందూ దేవాలయాల పునరుద్ధరణలో తన వంతు కృషి చేసి ఈనాడు మహిళల సాధికారితకు స్ఫూర్తి కలిగించిందన్నారు. ఈ తరo మహిళలు ఆమెను ఆదర్శవంతంగా తీసుకొని ప్రస్తుత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వస్తున్న మార్కులను తమ లక్ష్యాలకు అనుగుణంగా అలవర్చుకొని మహిళలంతా జాతీయతను దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమము లో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డా. కే.పద్మావతి , వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు , డాక్టర్ ప్రసన్న, డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ సరిత, డాక్టర్ వెంకటేశ్వర్లు , డాక్టర్ మృదుల, డాక్టర్ నిర్మల మరియు ఇతర కళాశాల అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ముఖ్యఅతిథి ప్రొఫెసర్ సూర్యనారాయణ కు, అధ్యాపక బృందానికి ,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు విద్యార్థులకు
ఏ బి ఆర్ ఎస్ ఎం బేగంపేట కళాశాల యూనిట్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఉపన్యాసకులు ఆధ్యాత్మిక ప్రవక్త ఆధ్యాత్మిక ప్రవచకులు ప్రొఫెసర్ కాకునూరి సూర్యనారాయణ పాల్గొన్నారు.

