వక్త, రచయిత, జాతీయవాది, దేశభక్తి పరాయణులు స్వర్గీయ తీగల కాళిదాస్ మూడవవర్ధంతి సందర్భముగా తీగల కాళిదాస్ సేవా సంస్థ నిర్వాహకులు తీగల కేదార్ నాధ్, సత్యవతి దంపతుల ఆధ్వర్యములో గురువారం స్థానిక కర్నూల్ రోడ్డు, ఉమా మనోవికాస కేంద్రం లోని విద్యార్ధులకు రాత్రి భోజనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తీగల సత్యవతి మాట్లాడుతూ మా మామగారు తీగల కాళిదాస్ జ్ఞాపకార్థం కాళిదాసు గారికి సమాజంలోని అనాధలు అభాగ్యులకు సేవ చేయాలనే తపన మెండుగా ఉండేదని వారి ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి కాళిదాసు సేవా సమితిని ఏర్పాటు చేసి వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మరియు ఏ ఒక్కరు ఆర్థిక లేమితో విద్యకు దూరం కాకూడదని భావంతో దాతల సహకారంతో వారికి కావలసిన విద్యా సంవత్సరపు ఫీజులు పుస్తకాలు విద్యాసామగ్రిని అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తీగల కాళిదాసు మనుమరాలు తీగల మానస పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించారు స్వహస్తాలతో ఉమా మనో వికాస కేంద్రం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమంలో బి విజయ రావు, తీగల మానస, దేవరపల్లి శ్రీలక్ష్మీ, రాజు, రేవతి, ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.


