బంజారాహిల్స్ మార్చి 14(జే ఎస్ డీ ఎం న్యూస్)
దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే రంగుల పండగ హోళీ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లోని ఇనీషియం అపార్ట్ మెంట్ లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రామ్ నివాస్ బన్సాల్ నివాసంలో నిర్వహించిన హోళీ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రంగులు పూసారు. హోళీ వేడుకలలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బద్రి విశాల్ బన్సాల్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పీయూష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.



