శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో పాల్గుణమాసం ఏకాదశి, శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత శోభాయమానంగా జరిగినది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సామూహికంగా గోవింద నామస్మరణ చేస్తూ స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్దగల శ్రీ బాపూజీ గోసంరక్షణశాల, గోశాల వద్ద గోపూజ నిర్వహించుకొని మంగళ వాయిద్యాల నడుమ భక్తులు తమ భుజస్కందాలపై స్వామి వారి పల్లకిని మోస్తూ భక్తి పారవశ్యం తో శ్రీగిరి గిరి ప్రదక్షిణకు ఉదయం 5 గంటలకు బయలుదేరారు. కోర్టు సెంటర్, మాతా శిశు వైద్యశాల, గ్రంధాలయం, కేశవ స్వామి పేట మీదుగా భగీరథ మహర్షి సెంటర్, శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దలగుంట, రాజా పానగల్ రోడ్డు దాటుకొని గోశాల ముందుగా శ్రీగిరి చేరి శ్రీవారిని దర్శించి అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. స్వామి వారి పల్లకిని, ఛత్రమును మోయుటకు భక్తు ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం, స్వామివారికి ఇష్టమైనటువంటి తిధి ఏకాదశి రెండు ఒకరోజు రావడం ఆ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీగిరి గిరిప్రదక్షిణ చేసిన వారికి అత్యంత పుణ్యఫలం స్వామివారి ఆశీస్సులు దక్కాయని, గోవిందాయని నామస్మరణతో శ్రీగిరి గిరి ప్రదక్షిణ పురవీధులు మారుమ్రోగాయని తెలిపారు.
కార్యక్రమంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి ఉపాధ్యక్షులు దాసరి నారియణ రావు, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు నల్లమల్లి కోటి సూర్యనారాయణ, ధనిశెట్టి రామునాయుడు, దేసు కృష్ణారావు, దోగిపర్తి మల్లిఖార్జునరావు, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, కోణిజేటి కృష్ణకిషోర్, ఎస్ భరత్, రోశయ్య మరియు మహిళాభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








