ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మారేడుపల్లి లో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆఫీసర్ బి.సుధాకర్ 7703 శుక్రవారం ఉదయం సుమారు 08.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ క్లబ్ ఇన్ గేట్ వద్ద జిగ్ జాగ్ బారిగేటింగ్ వద్ద విధులు నిర్వర్తించి తిరిగి జే.బి.ఎస్ లో వున్నా అవుట్ పోస్టుకి వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జే.బి.ఎస్. లో సెల్ ఫోనును దొంగిలించి పారిపోవాదాన్ని గమనించి వారిని వెంబడించి చాకచక్యంతో జే.బి.ఎస్. ఇన్ గేట్ వద్ద వారిని పట్టుకొని మారేడుపల్లి లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. హోమ్ గార్డ్ బి.సుధాకర్ చేసిన మంచి పనిని తెలుసుకున్న నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ సి పి జి. శంకర్ రాజు బి.సుధాకర్ ను మారేడుమిల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమక్షంలో శాలువాతో సత్కరించి అభినందించారు.
