డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సంధర్భంగా ఘననివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ -సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం కృషి మహనీయుడు డా.బాబు జగ్జీవన్ రామ్

డా.బాబు జగ్జీవన్ రామ్ గారి 118 వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు పోలీస్ అధికారులు జగజ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ….బాబూ జగ్జీవన్ రామ్ భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేతని, మంచి నాయకుడిగా ప్రజల మనసుల్లో చిరస్మరనీయుడయ్యాడని, భారత పార్లమెంటులో పిన్న వయసులోనే మంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించటమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారన్నారు. అట్టడుగు వర్గాల అభున్నతికి, అణగారిన వర్గాలకు సమాన హక్కుల కోసం ఎనలేని పోరాటం చేశారని, భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని పొందుపరచడంలో ప్రముఖ పాత్ర పోషించారని, కార్మికుల హక్కులు, వ్యవసాయ అభివృద్ధి, విద్య కోసం అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. మంచి ప్రజానాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, పరిపాలనాదక్షుడిగా ప్రజలచేత ఆప్యాయంగా “బాబూజీ” అని పిలిపించుకున్నారని, అలాంటి మహనీయుని ఆదర్శాలను పాటిస్తూ సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు
కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణ రెడ్డి, ఎఆర్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *