మన కూటమి ప్రభుత్వంలో పల్లె ప్రగతి సాధ్యం – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

దర్శి మండలం లంకోజన పల్లి గ్రామంలో ఆదివారం ఆంజనేయస్వామి తిరుణాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి , డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ…వ్యవసాయ ఆధారిత పల్లెలు మన కూటమి ప్రభుత్వంలో ప్రగతి పథం వైపు పరుగులు తీస్తున్నాయన్నారు. అందులో భాగంగానే గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు 15 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 10 నెలల కాలంలో చేపట్టామన్నారు. మీరు చూస్తున్నారు, మన కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తిరునాళ్లలో ప్రజలందరూ కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా వర్గవైశ్యమ్యాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన తిరునాళ్లను ఆస్వాదిస్తున్నారని … ఇది మన ప్రభుత్వంలోనే సాధ్యమని అన్నారు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో పాలన సాగిస్తున్నారని అన్నారు . పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పి 4 అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు . దీని ద్వారా పేదరిక నిర్మూలన ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు . అదే స్ఫూర్తితో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు గత వైసిపి నిర్లక్ష్యానికి నిదర్శనంగా వదిలేసిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ……. దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారని అన్నారు . దర్శి లో ఈ ఏడాది నడకలో మీ అడుగులో అడుగు వేస్తూ ఒక సేవకురాలుగా పనిచేస్తున్నానని తెలిపారు . మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆదరాభిమానాలతో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తానని మాట ఇస్తున్నానని చెప్పారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమం లో లంకోజనపల్లి గ్రామ టిడిపి నాయకులు, జనసేన నాయకులు, దర్శి మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు దారం సుబ్బారావు, సానే సుబ్బయ్య, చిన్న, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జి లు మహిళలు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *