బేగంపేట ఏప్రిల్ 9(జీ ఎస్ డి ఎం న్యూస్): పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనే సత్యనారాయణ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. బేగంపేట కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సి.సత్యనారాయణ మంగళవారం సాయంత్రం గుండెపోటు తో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే. తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం బేగంపేట లోని చీకోటి గార్డెన్ లో గల వారి నివాసానికి వెళ్లి సత్యనారాయణ మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ టి.మహేశ్వరి, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, డి.. వి.నరేందర్ రావు, శేఖర్, ఆరీఫ్, ఆకుల హరికృష్ణ తదితరులు ఉన్నారు.

