బేగంపేట ఏప్రిల్ 9(జే ఎస్ డి ఎం న్యూస్):
కూకట్ పల్లి నియోజక వర్గం బేగంపేట బి ఆర్ ఎస్ నాయకుడు సి.సత్యనారాయణ అకాల మరణం గురించి తెలుసుకున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం. కృష్ణారావు బుధవారం ఆయన నివాసానికి చేరుకుని పార్ధీవ దేహం పై పూల మాల. వేసి నివాళులు అర్పించారు.బేగంపేట్ డివిజన్ మాజీ వార్డ్ మెంబర్- సీనియర్ బి ఆర్ ఎస్ నాయకుడు సత్య నారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి,నాయకులు టి.శ్రీహరి, నరేష్,శ్రీనివాస్ గౌడ్,సురేష్ యాదవ్,తదితరులు ఉన్నారు.

