జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి అమ్మవారి కి ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. పూర్వం నుండి ఆర్యవైశ్యులు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించటం ఆచారంగా వస్తుంది. ఈ తరుణంలో కొంత కాలం ఆచారాన్ని మరచిన ఆర్యవైశ్యులు పెద్దల సూచనల మేరకు శతాబ్ధి (వంద సంవత్సరాల) తిరునాళ్ల సందర్భంగా మరళా 151 మంది మహిళలు కలశ బిందేలతో తూర్పు గంగవరం నుండి ప్రత్యేక బస్సులలో వచ్చి మంగళ వాయిద్యాలతో, డప్పుల మోతలతో అమ్మవారికి ప్రదక్షణ చేసి అభిషేకం చేసారు. ఉత్సాహంగా మహిళలు అందరూ పాల్గొని భక్తి శ్రర్థలతో తిలకించారు.
