సికింద్రాబాద్ ఏప్రిల్ 20(జే ఎస్ డి ఎం న్యూస్):
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్బంగా ఆదివారం ఉదయం వారాసిగూడ చౌరస్థాలో తెదేపా బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు గరిగే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి తెదేపా సికింద్రాబాద్ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు నాయకురాళ్లకు తినిపించారు. అనంతరంపండ్లుపంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, వెంకటస్వామి, నరేంద్ర, టెంట్ హౌస్ శంకర్, పిట్ల శంకర్ ముదిరాజ్, పొట్టిశీను, చంద్రమోహన్, దేవేందర్, సుధాకర్, రవి, చిరంజీవిరాజు, చందర్ ముదిరాజ్, నాయుడు, పుప్పాల విజయ్ కుమార్, రాహుల్, డెంటల్ ప్రవీణ్, సీనియర్ నాయకురాలు శేషిరేఖ తదితరులు పాల్గొన్నారు.
