పెండింగ్ సమస్యలను తక్షణ పరిష్కారానికి విఆర్ఎలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాళ్లూరు తహసీల్దార్ సంజీవ రావు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పలు సమస్యల పై ఆయన దృష్టి సారించారు. పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియరెన్స్ కు తగిన చర్యలు తీసుకున్నారు. సర్వే డిటీ ప్రశాంత్, సర్వేయర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
