బేగంపేట ఏప్రిల్ 28 :
ప్రజలు వాహనదారులకు అత్యవసర పరిస్థితులు ఎదురైన సమయంలో ట్రాఫిక్ సిబ్బంది, పాయింట్ డ్యూటీ కానిస్టేబుల్స్ సి పి ఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడాలని ఉత్తర మండలం ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ట్రాఫిక్ అడిషనల్ డిసిపి వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రాఫిక్ సిబ్బంది మొబైల్స్ పాయింట్ డ్యూటీ కానిస్టేబుల్ లకు ప్రధమ చికిత్స మరియు సిపిఆర్ గురించి శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా హార్ట్ ఎటాక్ వడదెబ్బ అగ్నిప్రమాదం మరియు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ట్రాఫిక్ సిబ్బంది ఏవిధంగా ప్రథమ చికిత్స చేయాలి ప్రధమ చికిత్స ఇట్లు ఉన్న మందులను పరికరాలను పాండేజ్ డెటాల్ ఆస్ ప్రింట్ టాబ్లెట్స్ కాటన్ మొదలగు వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలను వివరించారు ఈ శిక్షణలో ఉత్తర మండలం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బి వెంకట రాములు ఉపాశంకర్ ,జుట్టుభాస్కర్ మధు, పాపయ్య, రవికుమార్ ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ మొబైల్ డ్యూటీ ఆఫీసర్లకు ప్రథమ చికిత్స కిట్లు అందజేశారు.




