బేగంపేట ఏప్రిల్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
వేసవిలో పాదచారులు ఆర్టీసీ బస్సులు, ఇతరత్రా వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి దాహార్తిని తీర్చేందుకు 28 సంవత్సరాలుగా బేగంపేట ప్రకాశం నగర్ మెయిన్ రోడ్డు వద్ద సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షుడు షేక్ గౌస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరుతో ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మర్రి రవీంద్రారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. మర్రి చెన్నారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే షేక్ గౌస్ దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మరణానంతరం 1997 వ సంవత్సరం నుంచి బేగంపేట ప్రకాశం నగర్ మెయిన్ రోడ్డు మీద మర్రి చెన్నారెడ్డి జ్ఞాపకార్థం తాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి వేసవిలో పాదచారులకు తాగునీరు అందిస్తుంటారు ఏడాది కూడా మర్రి రవీంద్రారెడ్డి చేతులమీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మర్రి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి చెన్నారెడ్డి పేరుతో షేక్ గౌస్ చలివేంద్రాన్ని 28 సంవత్సరాలుగా నిర్వహిస్తూ పాదచారుల దాహార్తిని తీర్చుతుండటం అభినందనీయమన్నారు ప్రతి వేసవిలో బేగంపేటలో ఇలా చలివేంద్రం ఏర్పాటు చేయడం తమ కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హాజీ టోచర్, సిహెచ్ రాజేందర్, గౌర పల్లి రమేష్ ,అభిషేక్ అడపా, నసీరుద్దీన్ (అడ్డు) హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్ ,అల్తామాష్, పర్వేజ్ ,ఆలీ తదితరులు పాల్గొన్నారు.


