బేగంపేట ఏప్రిల్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
బిఆర్ఎస్ కీలక నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంగళవారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఎస్టి మహిళా కార్పొరేటర్ అయిన సుజాతపై ఎమ్మెల్యే ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం మహిళా కమిషన్ ముందు ఎమ్మెల్యే దేవీ రెడ్డి హాజరయ్యారు వివరణ ఇచ్చారు. కమిషన్ తనను అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు సుధీర్ రెడ్డి చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై ఫిర్యాదు చేశారని మండిపడ్డారు ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి ఓర్వ లేకనే కొందరు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టబోని ,తప్పకుండా న్యాయపోరాటం చేస్తానని అన్నారు .ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ ను ఉద్దేశించి సుధీర్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్టి మహిళా కార్పొరేటర్ బానోత్ సుజాత నాయకపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. ఒక ఎస్టి మహిళను కాబట్టే తనపై ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే మాట్లాడారని మహిళా కమిషన్ ముందు సుజాత కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న మహిళ కమీషన్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం గం 12 30 నిమిషాలకు ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మహిళా కమిషన్ ఎదుట హాజరై కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు .
