ప్రజావాణిలో 308 దరఖాస్తులు-దరఖాస్తులు స్వీకరించిన దివ్య

బేగంపేట ఏప్రిల్ 29 (జేఎస్ డిఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 308 దరఖాస్తులు అందాయి.
వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 104, విద్యుత్ శాఖకు సంబంధించి 18, రెవెన్యూ శాఖకు సంబంధించి 44, ఇందిరమ్మ ఇండ్ల కోసం 65 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 77 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
మైనారిటీ గురుకుల పాఠశాలల సొసైటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం ప్రజా భవన్ కు వచ్చారు. వారి సమస్యలపై దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులతో మాట్లాడారు.
సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *