ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ద్వేయం -ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా… మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ…ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ద్వేయం. ప్రజల నుంచి వచ్చిన ప్రతి పిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. ఇవాళ మొత్తం 250కి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరించాం. వాటిలో 100 కి పైగా రెవిన్యూ సమస్యలే వీటిపై జాయింట్ కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది, పరిష్కరిస్తామన్నారు. నేడు 25 రెవెన్యూ వినతులు పరిష్కరించాం, మరో 70 వినతులు 15 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ వంటి సమస్యలు కూడ త్వరలో పరిష్కరిస్తాం. భూ ఆక్రమణల ఫిర్యాదులపై విచారణ జరిపి నిజమని తేలితే భాద్యలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం నాడు పొన్నూరులో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు, ఐవీఆర్ఎస్ ద్వారా కాల్ చేసి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అమరావతి పున : ప్రారంభం సభకు వచ్చిన జన సందోహం చూసి వైసీపీ నేతలకు కళ్ళు బైర్లు కమ్మాయి. రూ.49 వేల కోట్ల పనులతో అమరావతికి పునరుజ్జీవం మొదలైంది. ప్రధాని మోదీ సహకారం సీఎం చంద్రబాబు విజన్ తో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపుదిద్దుకోవడం తథ్యం. అమరావతి, పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని మంత్రి
డా.డోలా బాల వీరాంజ నేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రైతులపై జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు -అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ ఏనాడైనా రైతుల గురించి పట్టించుకున్నారా -రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్వేయం -ప్రకాశం జిల్లా మర్రిపూడి లో రైతులకు యంత్ర పరికరాలు పంపిణీ చేసిన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

రైతులపై వైసీపీ అధినేత జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా మర్రిపూడిలో రైతులకు యంత్ర పరికరాలు, స్పేయర్లు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రైతులపై జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారని , అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ ఏనాడైనా రైతుల గురించి పట్టించుకున్నారా ? వైసీపీ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత 5 ఏళ్ళు రైతుల్ని విత్తనం నుంచి విక్రయం వరకు దగా చేసింది మీరు కాదా ? ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్ట లేని వాళ్ళు కూడా వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే మా ప్రభుత్వ ద్వేయమని, అన్న దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల అండగా ఉన్నారని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *