భారతదేశ సైనికుల యోగ క్షేమాల కోసం భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి & జిల్లా మహిళామోర్చా ఇంచార్జీ తీగల సత్యవతి సూళ్లూరుపేట చంగాళమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెహల్గాం ఉగ్రదాడి ఆసేతు హిమాచలం భారతీయులందరి మనసులను కలచివేసింది. అనంతరం భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ తీసుకున్న నిర్ణయం “ఆపరేషన్ సింధూర్” తో మహిళల సింధూరాన్ని కాలరాచిన ఉగ్రవాదుల స్థావరాలను పిఓకే మరియు పాకిస్తాన్లో సైనిక చర్య ద్వారా తునియత్తులు చేసి భారతీయులలో ధైర్యాన్ని పెంచారని తెలిపారు. అన్నగా, నాన్నగా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ భారతీయులుగా సమర్థించాలని, దేశానికి మన వంతుగా సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని. మనము ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే, మన రక్షణ వ్యవస్థ బలీయంగా ఉన్నదని, మనకు కేంద్రంలో సమర్ధవంతమైన బిజేపి నాయకత్వం ఉన్నందునే 145 కోట్ల మంది భారతీయులం క్షేమంగా, రక్షణ కలిగి ఉన్నామన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక్కరైనా దేశ సేవలో పునీతం అవ్వడానికి సైన్యంలో చేరాలని, ప్రతి ఒక్కరూ అగ్ని వీర్ ట్రైనింగ్ పొందాలని, రాబోవు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగార్ధులకు, రాజకీయలలోకి రావాలి అనుకొనే వారు తప్పని సరిగా ఆర్మీ ట్రైనింగ్ శిక్షణ పూర్తి చేసుకొని ఉండాలన్న చట్టం తీసుకొని రావాలని ప్రబుత్వానికి తీగల సత్యవతి విజ్ఞప్తి చేశారు.

