పట్టు సాధించారు … మండల పార్టీ అధ్యక్ష పదవి పట్టారు…

లక్కవరం గ్రామంలో టిడిపి పార్టీలో పట్టు సాధించి మండల పార్టీ పదవిని సాధించారు. లక్కవరం
గ్రామానికి చెందిన మేడగం వెంకటేశ్వర రెడ్డి తెలుగు దేశం పార్టీకి మంచి కార్యకర్తగా పనిచేస్తూ గుర్తింపు సాధించారు. ఈ నేపధ్యంలో ఒంగోలు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి పదవి సాధించారు. గత మూడేళ్ల క్రితం కూడ టిడిపి మండల పార్టీ అధ్యక్ష తనకు ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అధిష్టానానికి చెప్పారు. కాని కొన్ని కారణాలతో జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చారు. అదే లక్కవరం గ్రామంలో మిగిలిన నాయకులతో కలిసి మొదటి నుండి కాంగ్రెన్ కు తర్వాత వైసీపీ కి కంచు కోటగా ఉన్న ఓటర్ల ను కొట్ల కొట్టారు. 500 పైగా మెజార్టీ ఉన్న వైసీపీని మెజార్టీ పూర్తిగా దించి టిడిపికి 200 మెజార్టీ సాధించారు. దీంతో ఆయన కృషిని ఎట్టకేలకు అధిష్టానం గుర్తించారు. దర్శిలో ఆదివారం మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో టిడిపి నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, కడియాల రమేష్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి తనను కొనసాగించాలని కోరారు. అదే విధంగా గతంలో టిడిపి అధ్యక్ష పదవి చేసిన షేక్ పెద కాలేషా వలి (బడే), సీనియర్ నాయకుడు ఇడమకంటి రమణా రెడ్డి సైతం ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం, అధికంగా కార్యకర్తలు మేడగం వెంకటేశ్వర రెడ్డికి ఇవ్వటం నముచితం అని సూచించారు. దీంతో మండల టిడిపి పార్టీ అధ్యక్ష పదవి వెంకటేశ్వర రెడ్డికి దక్కింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *