ప్రకాశం జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ యం.ఎస్.ఎస్ అశోక్ బాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించిన సందర్భంగా…, ప్రకాశం జిల్లా(ఐఆర్సీయస్)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లా పోలిస్ కార్యాలయంలోని ఏఆర్ అడిషన ల్ ఎస్పీ కార్యాలయంలో నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఎం ఎస్ ఎస్ అశోక్ బాబును దశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెెడ్డి మాట్లాడుతూ…, పోలీస్ శాఖలో పనిచేస్తూ, సర్వీసులో ఎలాంటి రిమార్కు లేకుండా పదోన్నతి పొందటం ప్రతి ఉద్యోగీ గర్వించదగిన సందర్భమని అశోక్ బాబు సేవలను కొనియాడారు.విధి నిర్వహణలో ఆయన ప్రదర్శించిన అంకితభావం,నిబద్ధత,అత్యుత్తమ సేవలకు ఇది మంచి గుర్తింపు అని కపురం కొనియాడారు.
