జిల్లాలో మెగా డిఎస్‌సి పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచీ డిఎస్‌సి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలులో మెగా డిఎస్సీ పరీక్ష జరుగుతున్న బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. కేంద్రంలో పరీక్ష జరగుతున్న తీరుతెన్నులను ఆమె పరిశీలించారు. అభ్యర్థులకు అక్కడ కల్పించిన వసతులను, పరీక్ష నిర్వహణను, బందోబస్తును పరిశీలించారు. అభ్యర్ధులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… జిల్లాలో మెగా డిఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో మెగా డిఎస్సీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్ష జరుగుతుందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డిపార్ట్ మెంటల్ అధికారిని నియమించడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట అర్బన్ తాహసీల్దార్ మధుసూదన్ రావు,ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.


