పివో ఎస్ మెషీన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహణ

     ప్రకాశం జిల్లాలో పారదీప్ పాస్ పెట్స్ లిమిటెడ్ కంపెనీ తరఫున  పివో ఎస్  మెషీన్ల పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. 

జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్
హాల్‌లో విజయవాడ రీజియన్ పరిధిలో ప్రకాశం జిల్లాకు చెందిన పారదీప్ పాస్ పెట్స్ లిమిటెడ్ కంపెనీ తరఫున రిటైల్ వ్యాపారులకు పివో ఎస్ మెషీన్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కంపెనీ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పి.వి.సుభాష్ మాట్లాడుతూ… డీలర్లకు కంపెనీ తరఫున పివో ఎస్ డివైస్‌లను అందజేయడం జరిగింద ని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి (జెడిఎ) శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “డీలర్లు ఎల్లప్పుడూ రికార్డులను మెయింటైన్ చేయాలని, ఆ రికార్డుల ప్రకారం పి. వై స్టాక్‌ను ఎల్లప్పుడూ చెక్ చేసుకుంటూ, ఈ పివో ఎస్ మెషీన్లో అమ్మిన దానిని అమ్మినట్టుగా క్లియర్ చేయాలని చెప్పారు. అలా చేయని యెడల డీలర్లపై చర్యలు తీసుకుంటాం” అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్ వన్ ఈ పి ఓ ఎస్ మెషీన్ల గురించి వివరణాత్మకంగా వివరించడం జరిగింది. కొత్త ఆండ్రాయిడ్ డివైస్‌లతో ఈ పి ఓ ఎస్ సేల్స్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి వివరంగా వివరించారు. కార్యక్రమంలో ఈ పి ఓ ఎస్ మెషీన్ల స్పాట్ డిస్ట్రిబ్యూషన్, స్పాట్ ఇన్‌స్టాలేషన్ మరియు అవసరమైన డాక్యుమెంట్ల సేకరణ జరిగింది.
ఈ కార్యక్రమం లో ఒంగోలు ఏడిఏ రమేష్, ఏవో (టెక్) శ్రీనివాస్‌నాయక్, విజన్‌టెక్ కోఆర్డినేటర్ దనయ్య, డీలర్ల అసోసియేషన్ సంఘం ప్రెసిడెంట్ మరియు హోల్సేల్ డీలర్ దేసు వీరయ్య,మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పి.వి.సుభాష్, మార్కెటింగ్ మేనేజర్ పి.ప్రభాకర్, కంపెనీకి చెందిన జెకెఎస్ మరియు డిబిటి సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *