దర్శి కొత్తపాలెం ఆటో డ్రైవర్ వెలుగోటి ఉదయ్ కుమార్ కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ శనివారం ఆర్థిక సహకారం అందించింది. ఉదయ్ కుమార్ మృతి చెందటంతో ఆ కుటుంబ సభ్యులు జీవనాధారం కోల్పోయారు. దీంతో వారికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు రూ.5 వేలు, దాతల సహకారంతో మరో రూ.6058 వెరసి రూ.11058 ఉదయ్ కుమార్ భార్య సుజాతకు అందజేశారు. మానవత స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్, కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు ధనిరెడ్డి వెంకట రెడ్డి, కోశాధికారి గొర్రెపాటి వేణు, చింతా తిరుపతి రెడ్డి, చీదెళ్ల బసవయ్య, జె.సుశీలమ్మ, జూపల్లి కోటే శ్వరరావు పాల్గొన్నారు.
