తాళ్లూరు-1గ్రామ సంఘంలోని పొదుపు మహిళలు తీసుకున్న స్త్రీ నిధిబకాయిలు చెల్లించినా బాకీ వుందంటూ మండల సమాఖ్య నోటీసులు ఇవ్వటంతో తాళ్లూరు కాలనీ పొదుపు మహిళలు మంగళవారం స్థానిక వెలుగుకార్యాలయం వద్ద రగడ చేశారు. ఎస్సీ కాలనీకి చెందిన ప్రసన్న పొదుపు గ్రూపులోని మహిళలు స్త్రీ నిధి రుణాలు తీసుకున్నారన్నారు. తాము తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తూ వివోఏకు రసీదుకూడా పంపటం జరిగిందన్నారు.. తాము బకాయిపూర్తిగా చెల్లించినా మండల సమాఖ్య అధ్యక్షురాలు ఒక్కోరు రూ10,346ల బకాయి వున్నారని చెల్లించాలని నోటీసులు ఇవ్వటం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. నిత్యం కూలీ నాలీ చేసుకుని జీవిస్తున్నతాము చెల్లించిన బాకీ తిరిగి తెమ్మంటే ఎక్కడి నుండి తెచ్చి చెల్లించాలని వాపోయారు. మాగ్రామ సంఘ
తిరిగి తెమ్మంటే ఎక్కడి నుండి తెచ్చి చెల్లించాలని వాపోయారు. మాగ్రామ సంఘ విఓఏ అనూరాధకు బకాయి చెల్లించిన రసీదులు పంపినా తమ ఖాతాలో జమచే యుకుండా తమకు అప్పుఉన్నట్లుగా చెప్పడమేమిటని ప్రశ్నించారు. దీనిపై మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎంసుజాత, ఏపిఎం దేవరాజ్ లు రికార్డులు పరిశీలించి గ్రామసంఘం ఆన్లైన్లో బకాయి వున్నట్లు చూపినందునే నోటీసులు ఇవ్వటంజరి
గిందన్నారు.రికార్డుల పరిశీలనలోస్త్రీ నిధికి జమచేయాల్సిన బకాయిని విఓఏ సీఐ ఎఫ్ కి జమ చేయటంవల్ల స్త్రీనిధి బకాయి పెండింగ్ వున్నట్లు గుర్తించారు. వివోఏ చేసిన తప్పుకు తమ బాధ్యులన్ని చేసి నోటీసులు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు.
అప్పుకు తమ భాధ్యులంటూ నీటసులు ఇవ్వటం ఏమిటని ప్రశ్నంచారు.
విఓఏనే ఆనిధులను దుర్వినియోగం చేశారని, తమ బకాయిని రద్దు చేయాలన్నారు. వివోఏ తనమకేమి సంబంధం లేదని గతంలో పని చేసిన సీసీ కోటేశ్వరమ్మ చేసినట్లు చేశానని చెప్పటంతో దర్శిలో పని చేయుచున్న కోటేశ్వరమ్మను పిలిపించి మాట్లారు. తాళ్లూరు-1 గ్రామసంఘం ఏ గ్రూపులోని మహిళ ఎంత బాకీ వుంది, జమ కాని స్త్రీనిధి బాకాయికి ఎవరు బాధ్యులని వివోఏ ను విచారించగా తానే భాద్యత వహిస్తానని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇవ్వటం జరిగిందన్నారు. దీంతో పొదుపు మహిళలకు,వివోఏల మద్యవాగ్యువాదం జరిగింది. ఏపీఎం, మండల సమాఖ్య అధ్యక్షు లురాలు జోక్యం చేసుకుని రికార్డులను పూర్తిగా పరిశీలించి బకాయి వున్న వారి వద్ద నుండి వసూళ్లు చేసి, బకాయి చెల్లించిన వారికి న్యాయం జరిగేలా చూస్తా మని తెలిపారు.
