తాళ్లూరు మండలంలోని బోద్దికూరపాడు గ్రామంలో మంగళవారం స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ పర్యవేక్షణ బృందం పర్యటించారు. గ్రామంలో అమలు అవుతున్న పలు నీటి పధకాలు, పారిశుధ్య పనులను, మురుగునీటి నిర్వహణ, పాఠశాల, అంగన్ వాడీ, వ్యక్తి గతంగా మరుగుదొడ్ల వినియోగం ను పరిశీలించి పలువురుతో మాట్లాడారు. ప్రార్ధన మందిరాలు, హెల్త్ సెంటర్ల వద్ద పరిశీలించారు. ప్రత్యేక బృందం సభ్యులు సుధీర్, ప్రశాంత్, ఆర్ డబ్ల్యు ఎన్ ఎఈ వాలి, సర్పంచి ఎం శ్యామ్సన్, ఉప నర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ ఖాజా వలి, డిపి ఆర్సీ ఆర్ పి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

