క్షేత్ర స్థాయిలో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నిజమైన కౌలు రైతులకు నిర్దేశించిన లక్ష్యం మేరకు సిసిఆర్ సి కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా
అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్ల తో వర్చువల్ గా సమావేశమై సిసిఆర్సి కార్డుల జారీ, మ్యుటేషన్ కరెక్షన్ మరియు ట్రాన్స్ట్రాక్షన్స్, హౌసింగ్ ఫర్ ఆల్ లో భాగంగా ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్, కొత్త ఇంటిపట్టాల కోసం దరఖాస్తుల పరిశీలన, జిఓఎంఎస్ నెంబర్ 30 ప్రకారం రేగులరైజేషణ్, రీ సర్వే ప్రక్రియ, రేషన్ షాపుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 46,015 మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు మంజూరు లక్ష్యం కాగ, ఇప్పటి వరకు 11,579 మంది కౌలు రైతులకు సిసిఆర్ సి కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. మిగిలినవి రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యం మేరకు నిజమైన కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటిపట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయుటకు అవసరమైన స్థల సేకరణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న లే అవుట్స్ లో అందుబాటులో ఖాళీగా ఉన్న ప్లాట్స్ వివరాలు సమగ్రంగా పరిశీలన చేసి తక్షణం నివేదిక పంపాలని సూచించారు. కోర్టు కేసుల వలె రెవెన్యు కేసులు కూడా ఆన్ లైన్ లో చూసుకునేందుకు వీలుగా ప్రతి రెవెన్యూ కేసు వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని, ఇప్పటికే చాలా వరకు రెవెన్యూ కేసులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని, మిగిలిన రెవెన్యూ కేసులు కూడా ఆన్ లైన్ లో ఆప్ లోడ్ చేయుటకు సంబంధిత రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్నదాత సుఖీభవ పధకంనకు సంబంధించి పెండింగ్ లో వున్న ఈకేవైసి ప్రక్రియను పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్, తహసిల్దార్ల ను ఆదేశించారు. జి.ఓ ఎంఎస్ 30 ప్రకారం రేగులరైజేషణ్ ప్రక్రియను కూడా పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యు అధికారులను ఆదేశించారు. 22ఏ డాటెడ్ ల్యాండ్, భూమి అప్పగింత, అసైన్ మెంట్ ల్యాండ్ లకు సంబంధించి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రెవెన్యు అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా క్షేత్ర స్థాయిలో రీ సర్వే ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే రేషన్ కార్డు దారులందరికీ రేషన్ షాపుల ద్వారా రేషన్ అందించే కార్యక్రమం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో సమావేశంలో ఎస్.డి.సి లు శ్రీ వరకుమార్, శ్రీ శ్రీధర్, శ్రీ జాన్సన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, డిఎస్ఓ పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ శ్రీమతి వరలక్ష్మి, జిల్లా సర్వ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, తదితర అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి రెవెన్యు డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

