రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీటవేసి పాఠశాలలు మొరుగుపడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని మండల ప్రత్యే కాధికారి, బీసీ కార్పోరేషన్ ఈ డీ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 10 వ తేదీ జరుగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలపై హెచ్ఎం, గుర్తింపు పొందిన పాఠశాలల హెచ్ఎంలతో ప్రత్యేక సమావేశం మంగళవారం జరిగింది. ఈసందర్భంగా మాడ్లాడుతూ.. గ్రామాల్లో సమావేశాలకు ప్రోటోకాల్ ప్రకారం అందరికి ఆహ్యానాలు పంపాలన్నారు. ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాల్లో చదువుకునే పిల్లలు ఎందరు వున్నా అందరికి తల్లికి వందనంకి నగదు జమచేస్తూ అందరూ విద్యనభ్యశించేలా చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యం సరఫరా చేసిన తరువాత పాఠశాలలకు విద్యార్థుల సం ఖ్య పెరిగిందని, ఈ విషయాన్ని బడి మానుకున్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్గించాలన్నారు. గ్రీన్ పాస్ పోర్ట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులందరికి మొక్కలు పంపిణీ చేయాలన్నారు. పిల్లలకు నాటిన మొక్కలకు సంరక్షించే బాధ్యత అప్పగించాలన్నారు. ఈనెల10వ తేదీ అన్ని పాఠశాలల్లో తప్పని సరిగా మెగా పేరెంట్స్ , టీచర్స్ సమావేశం నిర్వహించి విజయవంతమయ్యేలా చూడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంఈవో జి.సుబ్బయ్య, ఎంఈవో-2-ఎల్.సుధాకర్ రావు, ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎంలు శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కె ప్రసాద్,పలు పాఠశాలల హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
