బేగంపేట జూలై 10(జే ఎస్ డి ఎం న్యూస్):
బేగంపేట్ కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ విమలాకర్ కేవలం మూడు నెలల వ్యవధిలో 50 మేజర్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.ఈ అధునాతన శస్త్రచికిత్సల్లో ప్యాంక్రియాస్, కాలేయం, బైలరీ ట్రాక్ట్, కొలాన్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు మరియు కాంప్లెక్స్ అబ్డోమినల్ వాల్ రీకన్స్ట్రక్షన్‌లు ఉన్నాయి. ఇవన్నీ Da Vinci రోబోటిక్ సర్జికల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించారు. అన్ని శస్త్రచికిత్సలు అత్యుత్తమ ఫలితాలతో, ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గురువారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ.వి. గురవారెడ్డి మాట్లాడుతూ ఆర్థోపెడిక్స్ విభాగంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో నాలుగు రోబోలు ఉన్నాయని, ఇండియాలో నాలుగు రోబోలు ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇదొక్కటే అన్నారు. ఇప్పటివరకు పదివేలకు పైగా ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలను విజయవంతంగానిర్వహించామని, ఆ అనుభవంతోనే సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అబ్డామిన్లో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను డా వించి రోబోటిక్స్ సాయంతో మూడు నెలల్లోనే 50 కి పైగా శస్త్ర చికిత్సలను డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ రోబోటిక్స్ వల్ల ఆపరేషన్ చేసే సమయంలో సేఫ్టీ,గ్యారంటీఉంటుందన్నారు. టెక్నాలజీ, హ్యూమన్ టచ్ అందజేస్తూ రోగులను గెస్ట్ లుగా గా ట్రీట్ చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ – సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, GI ఆంకాలజీ, బేరియాట్రిక్, రోబోటిక్ సర్జరీ & లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డా. విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ “రోబోటిక్ సర్జరీ ఇప్పుడే అధునాతన అబ్డోమినల్ శస్త్రచికిత్సల కోసం గోల్డ్ స్టాండర్డ్‌గా మారింది. దీనిలో ఉన్న 3D విజన్, రిస్టెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వల్ల అత్యంత క్లిష్టమైన భాగాల్లో కూడా ఖచ్చితమైన డిసెక్షన్ చేయవచ్చు. ఇది రక్తస్రావం తక్కువగా ఉండేలా, తక్కువ సంక్లిష్టతలతో, త్వరితపరిచే కోలుకునేలా చేస్తుందని తెలిపారు. తక్కువ నొప్పి, తక్కువ ఆసుపత్రి సమయం, త్వరితంగా సాధారణ జీవితానికి తిరిగి రావడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వృద్ధులు మరియు క్యాన్సర్ పేషెంట్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమయానుసారంగా పోషణ వారిలో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.టీమ్ విమలాకర్ యొక్క సర్జికల్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, మరియు పేషెంట్ ఫస్ట్ కెర్ పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. robotic శస్త్రచికిత్సల్లో విద్య, శిక్షణ, మరియు క్లినికల్ రీసెర్చ్ కార్యక్రమాలలో ఈ టీం చురుకుగా పాల్గొంటూ, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ దేశంలో అగ్రగామి రోబోటిక్ GI సర్జరీ సెంటర్‌గా నిలిపే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు.ఈ సందర్భంగా శాస్త్ర చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినపేషెంట్లు వారి అనుభవాలనుపంచుకున్నారు. డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్యాంక్రియాస్, హెర్నియా, లివర్ సంబంధ సమస్యలతో బాధపడుతున్న తాము శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్నామని తెలిపారు. అనంతరం డాక్టర్ విమలాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మినిమల్ యాక్సెస్, రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీల మధ్య ఉన్న తేడాను వివరించడంతోపాటు, రోబోటిక్ సర్జరీలతో ఉన్న ప్రయోజనాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం విమలాకర్ డాక్టర్ల బృందం పాల్గొన్నారు.
