బేగంపేట జూలై 20 (జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో బోనాల జాతర సందడి కొనసాగుతుంది ఆషాడ బోనాల జాతర సందర్భంగా అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బోనాలతో బారులు తీరారు. బేగంపేట లోని శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో తరలివచ్చారు. బోనాల జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వంగ అంబుజా, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చెక్కలు సుభాష్ ల ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని శీఘ్రంగా అందించేలా ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సర్వజన దర్శనం రాత్రి పది గంటల వరకు కొనసాగనుంది. బోనాలతో తరలివచ్చిన మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేశారు.
అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి.….
బేగంపేట లోని శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాడ బోనాల జాతర సందర్భంగా కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు నిర్వహింప చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చెక్కల సుభాష్ శాలువాతో ఘనంగా సత్కరించారు తీర్థ ప్రసాదాలను అందించారు
అనంతరం కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనతోపాటు బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి ఉన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చెక్కలు సుభాష్ ఆలయ ఈవో వంక అంబుజా లు వారు ఇరువురిని శాలువాలతో సత్కరించారు తీర్థ ప్రసాదాలను అందించారు. సాయంత్రం సమయంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారి కి బోనాలు సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ పరిసరాలతో పాటు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఆషాడ బోనాల జాతర సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల పూలతో వివిధ రకాలైన విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆదివారం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన వారిలో అమీర్పేట కార్పొరేటర్ సరళ బిజెపి సీనియర్ నాయకులు ఆనంద్ (నందు) పవన్ పాఠక్ తదితరులు ఉన్నారు.







