ప్రభుత్వం పేద రిక రహిత సమాజ ఆవిష్కరణకు పీ-4 కార్యక్రమాన్ని రూపొందించినట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ ఈడీ, తాళ్లూరు మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. మండలంలోని మల్కాపురం పంచాయతీ పరిధిలోని రజానగరం ,శివరామపురం గ్రామా లలో శనివారం పీ-4 కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 54 కుటుంబాలను పీ-4 కార్యక్రమంలో గుర్తించగా అందులో కొన్ని కుటుంబాలను పీ-4కు అనర్హలుగా గుర్తించిన ప్రత్యేక అధికారి మరోకసారి పరిశీలించాలని ఆదేశించారు. మిగిలిన కుటుంబాలకు అవసరమైన రేషన్ కార్డు, గ్యాన్ కనెక్షన్, అభివృద్ధి చెందటానికి కావలసిన చేయూత గురించి చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో మల్కాపురం సర్పంచ్ వలి ,ఎంపీడీఓ దార హనుమంతరావు, ఏపీఎం దేవరాజ్, మాజీ సర్పంచి వలి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వాలి, గ్రామకార్యదర్శి షహనాజ్ బేగం, నచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

