పేద ప్రజలకు సహాయం చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో సోమవారం బాబు ష్యూరిటీ మోనం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ నందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసారని నాడు వైసీపీ సొమ్ము కాదు కదా అని టీడిపి శ్రేణులు అన్నారని నేడు మరి అదే ప్రజల సొమ్ము పార్టీలకు కులాలకు అతీతంగా అందించటానికి ఏమి అయ్యినదని అన్నారు. నేడు ఒక సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు వైసీపీ వారికి సంక్షేమ పథకాలు ఇస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అని ఎలా అంటారని అన్నారు. నూపర్ సిక్స్ అని అలవీ కాని హామీలు ఇచ్చి నేడు అవి మాఫీ చేసుకోవటానికి వైసీపీ ప్రధాన నాయకులపై లిక్కర్ మరకలు అంటిస్తున్నారని అన్నారు. నాడు ప్రభత్వమే లిక్కర్ అమ్మి నగదును ప్రభుత్వమే తీసుకుంటుందని న అన్నారు. నేడు ప్రవేట్ వ్యక్తులచే అధిక ధరలకు లిక్కర్ అమ్మతూ, బెల్ట్ షాపులు నిర్వహిస్తే స్కామ్లు చేస్తున్నారని అన్నారు. ఇనుక, మట్టి, రేషన్ మాఫీయాకు ఇక తిరుగే లేదని అన్నారు. ప్రతి ఎన్నికలలో కళ్ల బొల్లి మాటలు చెప్పి మోసం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. 2014, 2024లలో కూడ అదే బాట పట్టారని అన్నారు. నేను నూపర్ సిక్స్ నెరవేర్చాను ఎవరైనా మాట్లాడితే వారికి నాలుక మందం అని సీఎం చంద్రబాబు అనటం దారుణమని అన్నారు. పిల్లలు అందరికి 15వేలు ఇస్తామని చెప్పి. మొదటి సంవత్సరం ఇవ్వక, రెండవ సంవత్సరం 20శాతం మాత్రం వారికి రూ.13వేలు మాత్రమే అందించారని అన్నారు. గాన్ పదకం కూడ ఇంత వరకు నక్రమంగా అమలు కావటం లేదని అన్నారు. ఉచిత బన్చుపై మాటతప్పుతూ కేవలం జిల్లాకు మాత్రమే పరిమితం చెయ్యాలని ఆలోచన చేయటం మోస పూరిత హామికి నిదర్శమన్నారు. ఉద్యోగాలు లేకుండా 20 లక్షల పైగా ఉన్న వారికి నిరుధ్యోగ భృతి కాని, ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని, 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 18 వేలు ఇచ్చే పథకం అడ్రన్ లేదని అన్నారు. అచ్చేం నాయుడు చెబుతున్నారు ఈ పథకాలు అమలు చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అన్న విషయాలు ఎన్నికలకు ముందు తెలియవా అని ఎద్దెవా చేసారు. అధికారమే పరమావధిగా నిన్సగ్గుగా అమలు చెయ్యలేని హామీ ఇచ్చారని అన్నారు. సంవత్స కాలంలో లక్షా 15వేల కోట్ల రూపాయలు అప్పు చేసారని ఇవి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని అన్నారు. గత జగన్న ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసారని నేడు ఎవరి జేబులలోనికి వెళ్లాయని నిలదీసారు. అమరావతి అభివృద్ధి అంటూ కాలక్షేపం చేస్తున్నారని అక్కడ నీళ్లు తోడటానికి సరిపోతున్నారని అన్నారు. పీఎం నరేంద్రమోదీని పిలిచి యోగాంధ్ర అంటూ ఒక్క రోజులో రూ. 300 కోట్లు ఖర్చుచేసిన ఘనత చంద్రబాబు నాయుడిని దక్కుతుందని అన్నారు. పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందరికి అందించే యోచన చంద్రబాబు నాయుడికి గాని, పవన్ కళ్యాణ్కు గాని లేదని అన్నారు. పేద ప్రజలపై వారికి సాను భూతి లేదని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న వారికి పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందనిఅన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్లో న్యాయం చేస్తామని అన్నారు. తాళ్లూరు మండలం పార్టీకి మంచి పట్టు ఉన్న మండలం అని ఎన్నికల సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందరూ ఒక్కత్రాటిపై వచ్చి పార్టీ కోసం పనిచేసి మంచి మెజార్టీ సాధిస్తారని కితాబు ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొంత సమయం అధికంగా జిల్లాలో కేటాయించాల్సి వస్తుందని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… 2014, 24లో కూటమిగా ఏర్పడి అలవి కాని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిందని అన్నారు. నేడు సంవత్సరం దాటినా సరే ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. గెలిచిన ఆరు నెలలో మన జగనన్న ఇచ్చిన నవరత్నాలు హామీలు అమలు చేసారని గుర్తు చేసారు. కరోనాలో సైతం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అన్ని అమలు పరచారని అన్నారు. నేడు రైతులతో సహా అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. అనంతరం బాబు ష్యూరిటి మోనం గ్యారంటీ స్కాన్నర్ను ఆవిష్కరించారు. ప్రతి ఇంటికి బాబు చేసిన మోనం తీసుకువెళ్లాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు టీవీ నుబ్బా రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, ఐవీ నుబ్బా రెడ్డి, జిల్లా కోప్షన్ మెంబర్ ఆదామ్ ఫరీఫ్ (బుజ్జి), మాజీ ఎంపీపీలు గోళ్లపాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎలీ వెంకటేశ్వర రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు పులి ప్రసాద్ రెడ్డి, ఆలోకం హరిబాబు, జిల్లా సర్పంచిల సంఘం ఉపాధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పులి ప్రసాద్ రెడ్డి, కుమ్మిత నాగి రెడ్డి, కుమ్మిత జయరామి రెడ్డి, యూత్, విద్యార్థి, రైతు విభాగం, కల్చర్, ఎస్సీ అధ్యక్షులు కొర్రపాటి శరత్, అశోక్, గువ్వల శ్రీనివాస రెడ్డి, పులి రమణా రెడ్డి, యామర్తి ప్రభుదాస్, సర్పంచిలు వలి, మందా శ్యామ్సన్, బి. వినాగి రెడ్డి, చిమటా సుబ్బా రావు, ఎం బ్రహ్మా రెడ్డి, ఎం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ లు ప్రభుదాన్, బాల కోటయ్య, మాజీ నర్పంచిలు పులి క్రిష్ణా రెడ్డి, వికాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లిని, జిల్లా చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పూల మాలతో సత్కరించారు.









