శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల..!!

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులు. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *