ప్రకాశం జిల్లా విఠలాపురం పంచాయితీలో బుధవారం మారం వారి పెళ్లి సందడి రాజకీయ సందడిగా మారింది. అనేక మంది ప్రముఖలు పాల్గొని విఠలాపురం సర్పంచి, జిల్లా సర్పంచిల సంఘ ఉపాధ్యక్షుడు, తాళ్లూరు మండల సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి- విజయలక్ష్మిల కుమారుడు విజయభాస్కర్ రెడ్డి, సంధ్య నూతన దంపతులకు దీవేనలు అందించారు. వైసీపి జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ భద్రా రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబులు పాల్గొని వధూ వరులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ విశ్లేషణ సంస్థ ఆరా చైర్మన్ ఆరా మస్తాన్, రాష్ట్ర అగ్రికల్చర్ కార్పోరేషన్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాస రెడ్డి లతో పాటు పలువురు ప్రముఖలు పాల్గొని దీవేనలు అందించారు. మండలంలోని ప్రముఖ నాయకులు, సర్పంచిలు, ఎంపీటీసీలు, అత్యధిక సంఖ్యలో పాల్గొని దీవేనలు అందించారు.



