డీలర్లు మెరుగైన సేవలు అందించాలి -తహసీల్దార్ బివి రమణా రావు

రేషన్ దుకాణ డీలర్లు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ బివి రమణా రావు కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మండలరేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క డీలరు సమయ పాలన పాటించి దుకాణాలను తీసి కార్డు దారులకు మంచి సేవలు అందించాలని చెప్పారు. సీనియర్ సిటిజన్ ల కు 26 నుండి 30వ తేది లోపు వారి నివాసాల వద్దకు రేషన్ పంపాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. స్టాకులో ఎటువంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు స్టాకు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని కోరారు. మెరుగైన సేవలు అందిస్తే మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. అనంతరం డీలర్ల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ను నన్మానించారు. వి. ఆర్ ఓ చంద్రశేఖర రావు, డీలర్ల సంఘ బాధ్యులు పిన్నిక రమేష్, తిరుపతి స్వామి, నాదేళ్ల శ్రీను, పేరి రెడ్డి, మాగంటి శ్రీను, నాగేశ్వరరావు, బ్రహ్మా రెడ్డి తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *