సాగు పనులు ముమ్మరంగా చేస్తున్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తూర్పుగంగవరంలోని శ్రీనివాస, ధనలక్ష్మి ఫెర్టిలైజర్స్ ను గురువారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. యూరియా, డీఏపి, 20– 20 -0-13 నమూనాలను తీసుకుని రీజనల్ కోడింగ్ సెంటర్ విశాఖ పట్నంకు శాంపిల్స్ పంపనున్నట్లు తెలిపారు.
