ఘనంగామువ్వన్నెల త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని

ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పువెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక ఉద్యమ నేత, స్వాతంత్య్రసమరయోధులు,మువ్వన్నెల త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని, ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ , జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ డైరెక్టర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాద్యాయులు కొల్లూరి ప్రకాష్ రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సభాధ్యక్షులు హెచ్. ఎమ్. కె. ప్రకాష్ రావు మాట్లాడుతూ…. ప్రస్తుత ఈ సమాజానికి మంచి ఆదర్శప్రాయుడు, దిక్చూసని పింగళి వెంకయ్య సేవలను ఎప్పటికీ మనం మరచిపోకూడదని పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ డైరెక్టర్ కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…, మువ్వన్నెల త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య ను ప్రపంచంలోని 195 గుర్తింపుపొందిన దేశాలలోని భారతమాత ముద్దుబిడ్డలు ఎప్పటికీ మరచిపోరని, మరకూడదని, అన్నీ దేశాల జాతీయ పతాకాలలో మన త్రివర్ణపతాకమే మెరిసిపోతూ అందరినీ ఆకర్షించి, ఆకట్టుకుంటుందని, ఎన్నియుగాలు మారినా దీని వన్నెతగ్గకుండా డిజైన్ చేశారని పింగళి వెంకయ్య ఘనకీర్తిని కొనియాడారు.
పింగళి వెంకయ్య స్వాతంత్య్ర ఉద్యమానికిముందు ఆనాడే సామాజిక నేతగా ప్రజలను చైతన్య పరిచిన గొప్ప ఉన్నతమైన ఆశయాలుగలిగిన మహనీయుడని, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత స్వాతంత్య్ర సమరయోధుడని, ప్రపంచంలో మానవాళి బ్రతికి వున్నంతకాలం ఎప్పటికీ మరచి పోరని, పింగళి వెంకయ్య చిరస్మరనీయుడని ఆయన భారత దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువకూడదని ఆయన చేసిన సేవలను విద్యార్థులకు సవివరంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో 270 మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *