ప్రకాశం జిల్లాలోనే తాళ్లూరు, ముండ్లమూరు మండలాలను కొనసాగించాలి.

ప్రకాశం జిల్లాలోనే ముండ్లమూరు, తాళ్లూరు మండలాలను కొనసాగించాలని ఆయా మండలాల టిడిపి నాయకులు శనివారం దర్శి టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల ను కోరారు. గత వైసీపి అనాలోచిత నిర్ణయాల వలన జిల్లాల విభజన ప్రహాసనంగా మారిందని, జిల్లాను మూడు ముక్కలు చేసి విమర్శల పాలయిందని తెలిపారు. మరలా మార్కాపురం జిల్లా ఏర్పాటుతో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా తమ రెండు మండలాల ప్రజలు అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా గట్టిగా ప్రయత్నం చెయ్యాలని కోరారు. మార్కాపురం జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అదే విధంగా గతంలో కందుకూరు రెవిన్యూ డివిజన్లో ఉండి బహుదూరమై ఇబ్బందులు పడిన విషయాలను గుర్తు చేసారు. ప్రస్తుతం ఒంగోలు డివిజన్లో ఉ న్న తమను అదే జిల్లాలో కొనసాగించాలని, మార్కాపురం అయితే మరలా చాలా వ్యయ, ప్రయానలు ఉంటాయని గుర్తు చేసారు. దర్శి నియోజక వర్గంలో కనిగిరి రెవిన్యూ డివిజన్లో ఉన్న మండలాలను మార్కాపురం జిల్లాలో, ఒంగోలు రెవిన్యూ డివిజన్లో ఉన్న మండలాలు ప్రకాశం జిల్లాలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించి విన్నవించారు. పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి మానం రమేష్ బాబు, పాశం నూరిబాబు (పెద్దన్న), పిన్నక రమేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ పరగాని పౌల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *