ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ ఇంటి వద్దకే పధకం త్వరితగతిన లబ్దిదారులకు అందేలా చూడాలని డిప్యూటి తహసీల్దార్ ఫణి కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మండల రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ పంపిణీలో మండలం పర్సంటేజీలో చాలా వెనబడి ఉన్న విషయాన్ని గుర్తు చేసారు. 1వ తేది నుండి కార్డు లబ్దిదారులు అందరికి ఉదయం ఏడు గంటల నుండి రేషన్ పంపిణీ చెయ్యాలని కోరారు. కార్డు దారులకు మెరుగైన సేవలు అందించాలని, నకాలంలో పంపిణీ చేసి మెరుగైన పర్సంటేజిని సాధించాలని సూచించారు. విఆర్డిఓ చంద్రశేఖర్ రావు, డీలర్ల సంఘ మండల అధ్యక్షుడు పిన్నక రమేష్, సుబ్బా రెడ్డి, మాగంటి శ్రీను, బ్రహ్మా రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.
