అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మపాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్

హైదరాబాద్, (జేఎస్ డి ఎం న్యూస్) :
అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) అంత్యక్రియల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆమె పాడే మోశారు. కనకరత్నమ్మ శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. అంత్యక్రియలకు అల్లు, మెగా ఫ్యామిలీలు వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రేపు వచ్చి పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా హీరోలు కూడా రేపు రానున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద వందలాది మంది అభిమానులు కనిపిస్తున్నారు. కోకాపేట వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *