యూరియా సక్రమంగా అందక రైతాంగం ఆందోళన చెందుతున్నారని మన్నేపల్లి సొసైటీకి యూరియా విడుదలకు చర్యలు తీసుకోవాలని మన్నేపల్లి సొసైటీ అధ్యక్షులు గొందిరమణారెడ్డి (సమర) ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించారు. నూతనంగా సొసైటీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సొసైటీ అధ్యక్షులు గొంది రమణారెడ్డి ఆదివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని, రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మన్ నూకసానిబాలాజీలనుమర్యాద పూర్వకం గా కలిశారు. వారివురిని శాలువాలతో సత్కరించారు. యూరియా అందటం లేదని రైతాంగం గగ్గోలు పడుతున్నందున, యూరియా విడుదల చేయించాలని ఎంపీ మాగుంటకు విన్నవించారు. ఎంపీ మాగుంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు కి ఫోన్ చేసి తక్షణమే మన్నేపల్లి సొసైటీకి యూరియా సరఫరా చేసి రైతాంగంకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించగా జిల్లా అధికారి విడుదలకు చర్యలు చేపట్టారని రమణారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐ.వెంక టరెడ్డి, షేక్ కాలేషావలి, అనపర్తి ఎఫ్రయిమ్, నాదెండ్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
